క్లైమాక్స్‌లో విజ‌య్ పొలిటిక‌ల్ ఎంట్రీ

క్లైమాక్స్‌లో విజ‌య్ పొలిటిక‌ల్ ఎంట్రీ

చెన్నై:ప్రముఖ నటుడు విజయ్ తమిళనాడులో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పార్టీ అధ్యక్షుడిగా విజయ్ ఎన్నికయ్యారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల కమిషన్ వద్ద పార్టీని నమోదు చేసే ప్రక్రియ చేపడుతున్నామని విజయ్ టీంలో కీలక సభ్యుడు ఒకరు తెలిపారు. పార్టీ రిజస్ట్రేషన్కు ముందు జరిగిన జనరల్ కౌన్సిల్ భేటీకి 200 మంది సభ్యులు హాజరయ్యారని సమాచారం. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, ట్రెజరర్ను నియమించారని, కేంద్ర కార్యవర్గ కమిటీని నెలకొల్పారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ పేరు, రిజిస్ట్రేషన్పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ కౌన్సిల్ విజయ్కు అప్పగించింది. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయ్ తన రాజకీయ పార్టీని ప్రజల ముందుకు తీసుకువస్తారని ఆ వర్గాలు వెల్లడించాయి.పార్టీ పేరులో తమిళనాడు సంప్రదాయాలకు అనుగుణంగా కజగం పదం ఉంటుందని తెలిపాయి. తమిళ సినిమాలో మరో రజనీకాంత్లా పేరున్న విజయ్ ఇప్పటివరకూ 68 సినిమాల్లో నటించగా గత పదేండ్ల నుంచి రాజకీయ అంశాలను టచ్ చేసే సినిమాల్లోనూ నటిస్తున్నారు. తమిళనాడు వ్యాప్తంగా విజయ్కు పలు అభిమాన సంఘాలున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos