వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ

హైదరాబాదు :వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో విజయదేవరకొండ ఒక సినిమాలో నటించనున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన -ఫైటర్ చిత్రీకరణ కరోనా వల్ల వాయిదా పడింది. దీని తరువాత విజయ్ దేవరకొండ నటించనున్న సినిమాకు ఆత్రేయ దర్శకుడు. బ్రోచేవారెవరురా సినిమాతో హిట్ కొట్టిన వివేక్ ఆత్రేయ, ఈ సారి మరో యూత్ ఫుల్ సబ్జెక్ట్ తో సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. ఇంతవరకూ విజయ్ దేవరకొండ చేసిన పాత్రలకి ఈ కథ పూర్తి భిన్నంగా ఉంటుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos