ఆపార్టీకి కేవలం ఒక్క ఎంపీ సీటే

ఆపార్టీకి కేవలం ఒక్క ఎంపీ సీటే

చెన్నై: డీఎంకే కూటమిలో రెండు సీట్ల కోసం పట్టుబట్టిన ఎండీఎంకే చివరకు ఒక స్థానానికే సరిపెట్టుకుంది. ఈ మేరకు డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. ఈ ఎన్నికల్లో ఎండీఎంకే గెలిచేందుకు అవకాశాలున్న కాంచీపురం, కడలూరు, ఈరోడ్, విరుదునగర్, తిరుచ్చి, మైలాడుదురై నియోజకవర్గాలలో రెండు నియోజకవర్గాలను తమ పార్టీకి కేటాయించాలని ఎండీఎంకే పట్టుబట్టింది. డీఎంకే అధిష్టానం కుదరదని చెప్పటండంతో ఒక లోక్సభ సీటు, ఒక రాజ్యసభ సీటు కేటాయించాలని కోరింది. ఆ దిశగా సీట్ల సర్దుబాట్లపై డీఎంకే కమిటీ, ఎండీఎంకే కమిటీ సభ్యుల నడుమ మూడు విడతలుగా చర్చలు జరిగినా సీట్ల కేటాయింపు ఖరారు కాలేదు. చివరకు స్టాలిన్ సమక్షంలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. ఒక్కసీటు డీఎంకే అధిష్టానం కేటాయించింది. ఈ విషయమై అన్నా అరివాలయం బయట వైగో విలేఖరులతో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో డీఎంకేకు అండగా ఉంటూ కూటమి విజయానికి పాటుపడతామన్నారు. ఎండీఎంకే పోటీ చేయనున్న నియోజకవర్గం గురించి మిత్రపక్షాలతో చర్చించిన మీదట డీఎంకే అధిష్టానం ప్రకటిస్తుందన్నారు. రాజ్యసభ సీటు కోసం స్టాలిన్తో చర్చించలేదని, రాజ్యసభ ఎన్నికలు సమీపించినప్పుడు ఆ విషయమై ప్రస్తావించాలని అనుకుంటున్నామని వైగో తెలిపారు.

తాజా సమాచారం