పాకిస్తాన్ మిత్రుడితో చేతులు కలిపినా అమీర్ ఖాన్..

పాకిస్తాన్ మిత్రుడితో చేతులు కలిపినా అమీర్ ఖాన్..

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు.పాకిస్థాన్ కు మద్దతుగా నిలుస్తూ భారత్ పై వ్యతిరేక గళం వినిపిస్తున్న టర్కీ దేశ ప్రథమ పౌరురాలిని కలవడం వివాదానికి కారణమైంది.ఆగస్టు 15వ తేదీన టర్కి రాజధాని ఇస్తాంబుల్‌లో ఆ దేశ ప్రథమ పౌరురాలు ఎమైనా ఎర్డోగన్‌ను కలుసుకోవడం ఇప్పుడు అత్యంత వివాదాస్పదంగా మారాయి. అమీర్, ఎమైన్ భేటీపై నెటిజన్లే కాకుండా వీహెచ్‌పీ, కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీల నేతలు భగ్గమంటున్నారు.భారత్‌కు బద్ద శత్రువైన పాకిస్థాన్‌కు టర్కీ ప్రధాని ఎర్డోగన్ స్నేహ హస్తం అందించారు. భారతీయ వ్యతిరేక శక్తులతో అమీర్ ఖాన్ భేటీ కావడంపై నెటిజన్లు తప్పుపడుతున్నారు. మన శత్రు రాజ్య అధినేతతో భారతీయ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ భేటీ అవుతారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గతంలో భారత్‌కు మిత్రదేశం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యూతో కలువడానికి అమీర్ ఖాన్ నిరాకరించారు. అయితే ఇప్పుడు టర్కీ ప్రథమ పౌరురాలితో సమావేశమై ఆ దేశ అభివృద్ధి పథకాలకు సంబంధించిన విషయాలను చర్చిాంచారు. ఇదేట్ల సమంజయం అంటూ పలు రాజకీయ పార్టీల నేతలు, నెటిజన్లు భగ్గుమంటున్నారు.అమీర్ ఖాన్ ఇలా నెటిజన్లు, రాజకీయ పార్టీల ఆగ్రహానికి గురికావడం మొదటిసారి కాదు. 2015లో కొన్ని విషయాల తనకు అసహనం కలుగుతున్నది. నా భార్య కిరణ్ రావు, నా బిడ్డ దేశంలో నివసించాలంటే అభద్రతా భావానికి గురి అవుతున్నారు అని అమీర్ ఖాన్ వ్యాఖ్యలు చేయడం వివాదమైంది. ఆ సమయంలో విశ్వ హిందూ పరిషత్ ఆయన నటించిన దంగల్ సినిమా రిలీజ్ చేయవద్దంటూ నిరసన వ్యక్తం చేసింది.అమీర్ ఖాన్, ఎమైనా ఎర్డోగన్‌ భేటీపై వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ భన్సాల్ మాట్లాడుతూ.. భారతీయ నటులంటే ప్రేక్షకులకు ఎంతో గౌరవం. వారి నటన, సినిమాలను ఎంతో ఆదరిస్తారు. అలాంటి నటులు భారతీయ వ్యతిరేక విధానం అవలంభిస్తున్న టర్కీ దేశాధినేత భార్యతో భేటీ అయ్యారు. అమీర్ ఖాన్ తీరు భారతీయ సినీ ప్రేక్షకుల మనోభావాలను గాయపరిచింది. ఇలాంటి వారిపై మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యలు చేశారు.ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన అభిషేక్ మను సింఘ్వీ కూడా నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. అమీర్ ఖాన్ పేరు ఎత్తకుండానే తాజా భేటిని తప్పుపట్టారు. తయ్యిప్ ఎర్డోగాన్ భారతీయ వ్యతిరేకి. అతడి విధానాలు భారత్‌కు ముప్పుగా మారాయి. అలాంటి వ్యక్తులు, దేశాధినేతలతో సంప్రదింపులు, సమావేశాలను తప్పుపట్టాల్సిందే అంటూ ట్వీట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos