ఉద్యమ సింహం చిత్రంపై ఈసీకి ఫిర్యాదు..

ఉద్యమ సింహం చిత్రంపై ఈసీకి ఫిర్యాదు..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయ ప్రస్థానం ఆధారంగా తెరకెక్కిన ఉద్యమ సింహం చిత్రంపై తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ.హనుమంత రావు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.ఉద్యమ సింహం చిత్రం ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా ఉందని అందుకే చిత్రాన్ని ఎన్నికలు నిర్వహించనున్న ఏప్రిల్‌ 11వ తేదీ వరకు నిలిపివేయాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ అయితే కేసీఆర్‌ చేసిన పోరాటాలు,ఉద్యమాల వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినట్లు ఉద్యమ సింహంలో చూపించారంటూ ఆరోపించారు.ఉద్యమ సింహం చిత్రాన్ని ఏప్రిల్‌ 11వ తేదీ వరకు విడుదల కానివ్వకుండా నిలిపివేయాలంటూ సీఈసీ సునీల్‌ అరోరాకు వినతి పత్రం ఇచ్చారు.ఇక ఎన్టీఆర్‌ రాజకీయ ప్రస్థానం గురించి రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంపై కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘాన్ని,హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చిత్రాన్ని విడుదల కానివ్వకుండా నిలిపివేయాలంటూ పిటిషన్‌ దాఖలు కావడంతో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌పై స్టే విధించింది.దీంతో చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌ మినహా ప్రపంచమంతా విడుదల చేయనున్నట్లు దర్శకుడు ఆర్జీవీ ప్రకటించాడు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos