అడ్వాన్స్‌లు తిరిగిచ్చేసిన బోయపాటి..

  • In Film
  • February 27, 2019
  • 155 Views

కెరీర్‌లో మొదటి సినిమా అయిన భద్ర చిత్రం మినహా మిగిలిన అన్ని చిత్రాలు ఒకేమూసలో తీస్తూ ఏదోలా గట్టెక్కుతూ వస్తున్న మాస్‌ దర్శకుడు బోయపాటి శ్రీనుకు వినయ విధేయ రామ చిత్రం గట్టిషాక్‌ ఇచ్చింది. ఎంతలా అంటే మరో సినిమా అవకాశం దొరకలేనంతగా బోయపాటిక శ్రీను పరిస్థితిని వినయ విధేయ సినిమా తలకిందులు చేసింది.పైగా డిస్ట్రిబ్యూటర్లకు పరిహారం చెల్లించే విషయంలో నిర్మాత దానయ్యతో చెలరేగిన వివాదం అంతకు ముందు బోయపాటి పేరు ప్రస్తావించకుండా సినిమా ఫ్లాప్‌ అయింనందుకు క్షమించాలంటూ రామ్‌చరణ్‌ విడుదల చేసిన క్షమాపణ పత్రం బోయపాటిని ఇబ్బందుల్లోకి నెట్టేసాయి.దీంతో గతంలో అడ్వాన్స్‌లు ఇచ్చిన నిర్మాతలు అడ్వాన్స్‌లు వెనక్కి ఇచ్చేయాలంటూ బోయపాటిపై ఒత్తిడి చేస్తున్నారట.ప్రస్తుతం బాలకృష్ణతో సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్న బోయపాటి శీను నిజానికిది మైత్రి బ్యానర్ లో చేయాలి. అయితే బాలయ్య తన ఎన్‌బీకే ఫిలిమ్స్ మీద ఇది చేద్దామని ముందే చెప్పడంతో మైత్రి తనకు ఇచ్చిన అడ్వాన్స్‌ను వెనక్కు ఇచ్చాడని ఫిలిం నగర్ టాక్.ఇదే వరసలో మరో ఇద్దరు ముగ్గురు నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. ఒకేసారి అందరికి ఇవ్వడం కష్టం కాబట్టి కాస్త టైం అడిగినట్టు తెలిసింది.ఒకపక్క ఎన్టీఆర్ రెండు భాగాల డిజాస్టర్స్ తో డీలాపడ్డ బాలయ్యను ఒప్పించేందుకు శీను పవర్ ఫుల్ స్క్రిప్ట్ రాసుకోవడంలో బిజీగా ఉన్నాడు. ఈసారి బడ్జెట్ కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి ఆ నిబంధన మీద అనవరమైన లొకేషన్లు అవసరం లేని యాక్షన్ సీన్లు లేకుండా బిగుతైన స్క్రీన్ ప్లే కోసం టీంతో కలిసి డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos