ట్రావెల్ బస్సులో ‘వెంకీమామ’..

ట్రావెల్ బస్సులో ‘వెంకీమామ’..

దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పైరసీ భూతం.అన్ని చిత్ర పరిశ్రమల్లో చిన్న చిత్రాల నుంచి భారీ బడ్జెట్‌ చిత్రాల వరకు అన్నింటిని విడుదలైన సాయంత్రానికో లేదా మరుసటి రోజుకే పైరసీదారులు నెట్టింట్లో పెట్టేస్తున్నారు.ఈ విషయంలో తమిళ రాకర్స్‌ అనే వెబ్‌సైట్‌ మరింత బరి తెగించేసింది.సినిమాలు విడుదల కాకముందే నెట్టింట్లో పెట్టేయడం లేదా చిత్రం విడుదలైన ఫలాన రోజుకో,గంటలకో చిత్రాన్ని అంతర్జాలంలో పెట్టేస్తామని ప్రకటించేస్తుంది.దీంతో ఎన్నో చిత్రాలు పైరసీ రూపంలో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేయడంతో ఈ ప్రభావం వసూళ్లపై పడుతోంది.తాజాగా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన వెంకీమామ చిత్రం సైతం పైరసీకి గురైంది.అయితే పైరసీ చిత్రాన్ని ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో పైరసీ చిత్రం ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్ నుంచి మైసూర్ కి వెళుతున్న జబ్బర్ ట్రావెల్స్ బస్ లోవెంకీమామపైరసీ సీడీల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos