తమిళనాడు-కర్ణాటక సరిహద్దుల్లో వాహనాల తనిఖీలు

హొసూరు : తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27, 30 తేదీల్లో  రెండు విడతల్లో  జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని తమిళనాడు-కర్ణాటక సరిహద్దు వద్ద మద్య నిషేధ శాఖ పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఎన్నికల సందర్భంగా మద్యం ఏరులై పారే అవకాశం ఉండడంతో తమిళనాడు-కర్ణాటక సరిహద్దులోని జూజువాడి  వద్ద పోలీసులు నిరంతరం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కర్ణాటక నుంచి హొసూరు వైపు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎన్నికలు ముగిసేవరకు సరిహద్దులలో వాహనాల తనిఖీలను నిర్వహిస్తామని మద్య నిషేధ శాఖ డిఎస్పీ మురళి తెలిపారు. కర్ణాటక నుంచి తమిళనాడుకు అక్రమంగా మద్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని  హెచ్చరించారు. హొసూరు సమీపంలోని అన్ని చెక్ పోస్టులలో ఎన్నికలు ముగిసే వరకు 24 గంటలూ వాహనాలను తనిఖీ చేస్తామని ఆయన వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos