సరికొత్త టెక్నాలజీతో వైష్ణవి అపార్ట్‌మెంట్లు

  • In Money
  • September 3, 2019
  • 155 Views
సరికొత్త టెక్నాలజీతో వైష్ణవి అపార్ట్‌మెంట్లు

బెంగళూరు : స్థిరాస్తి రంగంలోని వైష్ణవి గ్రూపు తమ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడానికి కటెర్రా సంస్థతో చేతులు కలిపింది. తద్వారా అనుకున్న సమయం కంటే చాలా ముందుగానే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి వీలు పడుతుందని వైష్ణవి గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ సీఎన్. గోవిందరాజు తెలిపారు. కటెర్రా డిజైన్ హెడ్ నజీబ్ ఖాన్‌తో కలసి మంగళవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. తమిళనాడులోని కృష్ణగిరిలో కటెర్రా కర్మాగారం ఉందని, ప్లాట్ల నిర్మాణానికి అవసరమైన సామాగ్రిలో 80 శాతం అక్కడే సిద్ధమవుతుందని తెలిపారు. వాటిని ఇక్కడికి తీసుకొచ్చి కూర్పు చేయాల్సి ఉంటుందన్నారు. దీని వల్ల పెద్ద ప్రాజెక్టులను 12 నెలల నుంచి 18 నెలలు ముందుగానే పూర్తి చేయవచ్చని వివరించారు. తద్వారా 29 శాతం వరకు నిర్మాణ సామాగ్రి, నలభై శాతం వరకు నీరు ఆదా అవుతుందన్నారు. యలహంకలో 11 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న వైష్ణవి సెరెన్ ప్రాజెక్టులో ఈ టెక్నాలజీని వాడుతున్నామన్నారు. నిర్మాణ ఖర్చు 12 నుంచి 15 శాతం ఎక్కువైనా, ఎంతో సమయం, సామాగ్రి ఆదా అవుతుందని, కాలుష్యాన్ని కూడా 40 శాతం వరకు నివారించవచ్చని ఆయన వెల్లడించారు. నజీబ్ ఖాన్ మాట్లాడుతూ ఈ టెక్నాలజీతో నిర్మించే గృహాలకు వంద ఏళ్ల ఆయుర్దాయం ఉంటుందని భరోసా ఇచ్చారు.

.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos