తొలి కరోనా టీకా రష్యలో సిద్ధం

తొలి కరోనా టీకా రష్యలో సిద్ధం

మాస్కో : ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన దేశంగా రష్యా చరిత్ర సృష్టించనుంది. దీన్ని ఈ నెల 12న రిజిష్టర్ చేయనున్నట్లు రష్య ఆరోగ్య శాఖ ఉప మంత్రి అలెగ్ గ్రిడ్నేవ్ ప్రకటించారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఆరోగ్య కార్యకర్తలకు, చిన్నారులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రస్తుతం చివరి- మూడో దశ కొనసాగుతోందని తెలిపారు. టీకా సురక్షితంగా ఉంటుందని ఆశించారు. మాస్కోలోని షెచెనోవ్ విశ్వ విద్యాలయంలో జూన్ 18 నుంచి దీన్ని38 మంది పై ప్రయోగించారు. భద్రతాపరమైన శిష్ఠాచారాల్నిఇది పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా కరోనా టీకాల్ని వచ్చే అక్టోబర్ నుంచి ప్రజలకు వేసేందుకు ప్రణాళికలు రచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos