ఇదిగో…సైరా టీజర్

  • In Film
  • August 20, 2019
  • 107 Views
ఇదిగో…సైరా టీజర్

హైదరాబాద్‌ : చిరంజీవి నటించిన సైరా సినిమా టీజర్‌ విడుదలైంది. దీనికి పవన్‌ కళ్యాణ్‌ గాత్ర దానం చేయడం విశేషం. ఆసక్తికరంగా రూపొందించిన ఈ ప్రచార చిత్రం చిరంజీవి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తీస్తున్న ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి టైటిల్‌ రోల్‌ను, అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, తమన్నా, జగపతి బాబు, సుదీప్‌, విజయ్‌ సేతుపతి ఇతర ప్రాతలను పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos