పోరాటం ఆగదు : ఉత్తమ్

పోరాటం ఆగదు : ఉత్తమ్

హైదరాబాద్‌ : తెరాస శాసన సభ పక్షంలో సీఎల్పీని విలీనం చేసిన అంశంపై తాము చేపట్టిన పోరాటం కొనసాగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ దీక్ష చేస్తున్న భట్టి విక్రమార్కను అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. తెరాసకు మూడింట రెండు వంతులకు పైగా మెజారిటీ ఉన్నా, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని నిలదీశారు. అసెంబ్లీలో ప్రశ్నించే వారు ఉండకూడదని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారా అని ప్రశ్నించారు. పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న తమ ఫిర్యాదును పట్టించుకోలేదని విమర్శించారు. సీఎల్పీ విలీనంపై తాము హైకోర్టును ఆశ్రయించామని, దీనిపై మంగళవారం విచారణకు వస్తుందని తెలిపారు. తదనంతరం అవసరమైతే సుప్రీం కోర్టుకు కూడా వెళతామన్నారు. ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా ఇవ్వనున్నట్లు పత్రికల్లో వస్తున్న కథనాలను ప్రస్తావిస్తూ, తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఆ పార్టీకి విపక్ష హోదా ఎలాఇస్తారని ఆయన ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos