స్వరాన్ని మార్చిన ట్రంప్

స్వరాన్ని మార్చిన ట్రంప్

వాషింగ్టన్ : కరోనా వైరస్ వ్యాప్తికి చైనా కారణమని నిందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం వెనక్కు తగ్గారు. ఆశియావాసులు అ ద్భుత మైన ప్రజలని ట్విట్టర్లో ప్రశంసించారు. ‘ఆసియన్ అమెరికన్ కమ్యూనిటీతో పాటు ప్రపంచంలోని ఆసియా ప్రజలందరికీ భద్రత చాలా ముఖ్యం. వారు చాలా అద్భుతమైన ప్రజలు’ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి వారిని నిందించడం సరికాదని చెప్పారు. ‘ఈ వైరస్ నిర్మూలనకు వారంతా మనతో కలిసి పనిచేస్తున్నారు. అందరమూ ఆ మహమ్మారిపై విజయం సాధిద్దామ’న్నారు. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య అధికం. దీన్ని ‘చైనీస్ వైరస్’ అని డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చైనాకు ఆగ్రహం తెప్పించాయి. అమెరికాలో ఆశియా వాసులపై దాడులు పెరిగాయి. వీటన్నింటికీ ట్రంప్ వ్యాఖ్యలే కారణమని విమర్శలు వచ్చాయి.ఆయనవి జాత్యాంహకార వ్యాఖ్యలంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos