51 ఏళ్లకు మళ్లీ కనిపించిన రంగుల పాము..

51 ఏళ్లకు మళ్లీ కనిపించిన రంగుల పాము..

 ఐదు దశాబ్దాల క్రితం అంతరించిపోయినట్లు భావించిన సరీసృప జాతికి చెందిన ఓ పాము మళ్లీ కనిపించింది.సుమారు 1969లో చివరిసారిగా మరియన్‌ కౌంటీలో కనిపించిన రెయిన్‌ బో అనే పాము తాజాగా ఫ్లోరిడాలోని ఓక్లా జాతీయారణ్యంలో ప్రత్యక్షమైంది. పేరుకు తగ్గట్టే రెయిన్‌ బో పాము అనేక వర్ణాలతో ఉంటుంది. నీటి జాతికి చెందిన ఈ విషరహిత పాము వర్షారణ్య ప్రాంతాల్లో ఎక్కువగా నీట మునిగి ఉండే వృక్షాల మధ్య  జీవిస్తుంది. ఫ్లోరిడా మత్స్య, వన్యప్రాణి కన్జర్వేషన్ కమిషన్ రెయిన్ బో స్నేక్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos