120 ఏళ్ల లో అత్యధిక పోలింగ్

120 ఏళ్ల లో అత్యధిక పోలింగ్

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొన్ని వింతలు, విశేషాలు, సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. కరోనా ఉన్నా అత్యధికంగా బ్యాలెట్లు ఓట్లు నమోదు కావడం ఓ విశేషం.దేశ చరిత్రలోనే అత్యధిక ఓట్లు పొందిన అధ్యక్ష అభ్యర్థిగా డెమొక్రటిక్ నేత జో బిడెన్ ఘనత సాధించారు. అత్యధిక ఓటింగ్ శాతం నమోదైన ఎన్నికలు కూడా ఇవే కావడం మరో రికార్డు. 120 ఏళ్లలో ఎన్నడూ ఇంతటి పోలింగ్ నమోదు కాలేదని అమెరికా ఎన్నికల సంఘం వెల్లడించింది 23.9 కోట్ల మందికి ఓటు హక్కు ఉంది. ఎన్నికల్లో దాదాపు 16 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 120 ఏళ్ల తర్వాత అమెరికాలో అత్యధిక పోలింగ్ నమోదైన ఎన్నికలు ఇవే. చివరి సారిగా 1900లో అత్యధికంగా 73.7 శాతం, 2016 ఎన్నికల్లో 56 శాతం పోలింగ్ నమోదైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos