ఫోని హెచ్చరికలకు ఐరాస మెప్పు

ఫోని హెచ్చరికలకు ఐరాస మెప్పు

న్యూ ఢిల్లీ :ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు అవాంఛనీయాలు ముఖ్యంగా ప్రాణ నష్టం నిరోధానికి భారత ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని ఐక్యరాజ్య సమితి వైపరీత్యాల నివారణ విభాగం (ఓడీఆర్‌ఆర్) శనివారం ఇక్కడ విడుదల చేసిన ఓ ప్రకటనలో ప్రశంసించింది. అత్యంత ఖచ్చితత్వంలో ప్రజలను అప్రమత్తం చేసినందునే ఫొని తుఫాను ప్రభావాన్ని అడ్డుకున్నట్లు పేర్కొంది. ‘ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో వారు అద్భుతమైన పని తీరును కనబరిచార’ని సంస్థ ప్రతినిధి డెనీస్‌ మెక్‌క్లీన్‌ జెనీవాలోశనివారం ప్రశంసించారు. ‘అత్యంత ఖచ్చితత్వంతో వాతావరణ శాఖ విడుదల చేసిన హెచ్చరికల వల్ల 11 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగార’ని లో పేర్కొన్నారు. ఫొని వల్ల సంభవించిన మరణాలు శనివారం వరకూ పది 10 కంటే తక్కువగా ఉన్నాయి. ఒడిశాలో 1999లో సంభవించిన సూపర్‌ సైక్లోన్‌ 10వేల మందిని బలి తీసుకుంది. దీని నుంచి భారత్ పాఠాలు నేర్వడంతో 2013లో ఫైలిన్స్‌ వల్ల సంభవించిన మరణాల సంఖ్య అతి తక్కువగా ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యుఎమ్‌ఓ) ప్రతినిధి క్లేర్‌ నలిస్‌ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos