పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం..

పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం..

గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టులో గత తెదేపా ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని అందుకే రివర్స్‌ టెండరింగ్‌ వెళ్లనున్నామంటూ ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం అందులో భాగంగా పోలవరం ప్రాజెక్టు నుంచి నవయుగ కంపెనీని తొలగించిన తెలిసిందే. కాగా.. విషయంపై కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. జగన్ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాధాకరమని పేర్కొంది. దీనివల్ల పోలవరం ఎప్పటిలోగా పూర్తవుతుందో కూడా చెప్పలేమని విచారం వ్యక్తం చేసిందిపోలవరం జాతీయ ప్రాజెక్టే అయినా నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ ప్రభుత్వ హయాంలో వేఅవినీతి జరిగిందని ఆరోపిస్తోన్న  వైసీపీ ప్రభుత్వం రివర్స్టెండరింగ్కు వెళ్తామ ని ప్రకటించింది. దిశగానే నవయుగకు 60 సీ నోటీసులు ఇచ్చింది. పనులు ఆపేయాలని సంస్థను ఆదేశించిందికాగా, జలాశయాల భద్రతపై శుక్రవారం లోక్సభలో చర్చ జరిగిన సమయంలో పోలవరం అంశాన్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ప్రస్తావించంతో కేం ద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్షెకావత్బదులిచ్చారు. టెండర్లు రద్దు చేయడం వల్ల ప్రభావం ప్రాజెక్టు నిర్మాణంపై పడుతుందని కేంద్రమంత్రి ఆందోళన వ్య క్తం చేశారు. ‘పోలవరం ప్రాజెక్టు ఎప్పటిలోగా పూర్తవుతుందోనని సభ్యుడు ఆందోళన వ్యక్తం చేశారు. పోలవ రం నిర్మాణ పనులను రాష్ట్రమే చూసుకుంటోంది.నిర్మా పనుల్లో ఉన్న సంస్థ కాంట్రాక్టును రాష్ట్ర ప్రభుత్వం ద్దు చేసిందని చెప్పడానికి విచారిస్తున్నాను. నిర్ణ యం పోలవరం ప్రాజెక్టుకు మరో అవరోధంగా మారుతుంది. దీనివల్ల ప్రాజెక్టు పూర్తికి ఎంత కాలం పడుతుం దో చెప్పలేమన్నారు. నామినేషన్‌ ప్రాతిపదికపై పనులు అప్పగించడం సరైనది కాదన్న కారణంతోనే వారిని ప్రస్తుతం పనుల నుంచి తొలగిస్తున్నట్లు పోలవరం ప్రాజెక్టు అధికారులు వివరించారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు పై నిపుణుల కమిటీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాంట్రాక్టర్లకు అనవసరపు చెల్లింపులు చేశారని, పనుల్లో బాగా జాప్యం జరుగుతుందని రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని సూచనలు చేసిన నేపథ్యంలో కొత్తగా టెండర్లు పిలిచి ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కానీ పోలవరం రీ టెండర్ల వల్ల ప్రాజెక్ట్‌ ఖర్చు కచ్చితంగా పెరుగుతుందని… పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 70 శాతం పనులు పూర్తయ్యాయని 30 శాతం పనులు పూర్తి చేసినట్లయితే నవ్యాంధ్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు సాగునీరు, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తుందని వారి వాదన. కానీ ప్రభుత్వ నిర్ణయంతో అది సాధ్యమయ్యేలా లేదని , వైసిపి ప్రభుత్వం కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తోందని టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos