కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం

కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం

న్యూఢిల్లీ: జమ్మూ-కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని ప్రత్యేకంగా తీర్మానాన్ని చేసినట్లు జమాత్ ఉలేమా ఏ హింద్ సంస్థ ప్రధాన కార్యదర్శి మహ మూద్ మదానీ గురు వారం ఇక్కడ తెలిపారు. భారత్ సమగ్రత, భద్రత విషయంలో తాము రాజీ పడేది లేదని, వెనక్కి తగ్గబోమని స్పష్టీకరించారు. ‘భారత్ మా దేశం. మము దేశానికి అండగా నిలుస్తామ’ని తేల్చి చెప్పారు. పొరుగు దేశం పాకిస్థాన్ ముస్లింలు భారత్ కు వ్యతిరేకంగా ఉన్నట్లు అంత ర్జాతీయ సమాజానికి చూపేందుకు ప్రయత్నిస్తోందని మండి పడ్డారు. పాక్ చర్యలను తాము ఖండించినట్లు 1919లో ఆరంభమైన జమాత్ ఉలేమా ఏ హింద్ సంస్థ భారత జాతీయ కాంగ్రెస్(కాంగ్రెస్ పార్టీ)తో కలిసి ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొంది. మతం ఆధారంగా దేశాన్ని భారత్, పాకిస్థాన్ గా విభ జించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో కొందరు నేతలు వీరి నుంచి విడిపోయి జమాతే ఉలేమా ఇస్లామ్ పేరిట కొత్త సంస్థను ప్రారంభించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos