అస్థిరత సృష్టి కి హిందుత్వను వాడుకో వద్దు

అస్థిరత సృష్టి కి హిందుత్వను  వాడుకో వద్దు

నాగ్పూర్: సవరించిన పౌరసత్వ చట్టం(సీఏఏ)లో స్పష్టత లేదని శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. ముసాయిదాను లోక్సభలో ప్రవేశపెట్టినపుడు తాము అడిగిన ప్రశ్నలకు ఇప్పటి వరకు ప్రభుత్వం జవాబు చెప్పలేదని ఇక్కడ జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పేర్కొన్నారు. ‘ఈ చట్టం వల్ల ఎందరికి పౌరసత్వం లభించనుంది? వారంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ ఉండనున్నారు? అనే అంశాలపై స్పష్టత లేదు. వీరందరికీ ఎక్కడ ఆశ్రయం కల్పించాలన్న విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవు. దేశంలో అస్థిరత సృష్టికి హిందూత్వ సిద్ధాంతాల్ని వాడుకుంటే శివసేన సహించదు. మా పార్టీ ఇంకా హిందుత్వవాదానికి కట్టుబడి ఉంది. తమ సిద్ధాంతంలో భవిష్యత్తులోనూ ఎలాంటి మార్పు ఉండబోదు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంద’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos