భాజపా ఎమ్మెల్యే పై అత్యాచారం కేసు

భాజపా ఎమ్మెల్యే పై అత్యాచారం కేసు

ఉదయపుర్ :పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళపై అత్యాచారం చేశారనే ఆరోపణలతో భాజపా ఎమ్మెల్యే (గోగుండా) ప్రతాప్ లాల్ భీల్ (52)పై సుఖర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. సుమారు 35ఏళ్ల బాధిత మహిళ ఫిర్యాదును స్వీకరించినట్లు ఎస్పీ రాజీవ్ పచార్ వెల్లడించారు. కేసు దర్యాప్తును బాధ్యతను సీఐడీకి అప్పగించారు. వివాహం చేసుకుంటానని నమ్మించిన ఎమ్మెల్యే పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని మధ్యప్రదేశ్కు చెందిన బాధితురాలు ఆరోపించింది. బాధిత మహిళ, ఎమ్మెల్యే గత కొన్నేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యేను సంప్రదించగా ఆయన నుంచి స్పందన లేదు .

తాజా సమాచారం

Latest Posts

Featured Videos