ప్రేమను నిరాకరించిందని ప్రేమోన్మాది ఘాతుకం..

ప్రేమను నిరాకరించిందని ప్రేమోన్మాది ఘాతుకం..

తన ప్రేమను నిరాకరించి మరొకరితో వివాహానికి సిద్ధపడిందనే అక్కసుతో ప్రేమోన్మాది యువతి ఇంట్లో పెట్రోల్‌ చల్లి నిప్పంటించాడు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్లకు చెందిన శ్రీనివాస్‌ అనే యువకుడు అదే ప్రాంతంలో ఉంటున్న మేనత్త సత్యవతి కుమార్తెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.ఇదే విషయమై ఇరు కుటుంబాల మధ్య గొడవ జరగడంతో సత్యవతి తన కూతురికి మరొక వ్యక్తితో వివాహం చేయడానికి నిర్ణయించుకుంది.దీంతో తన ప్రేమను కాదని మరొక వ్యక్తితో వివాహానికి సిద్ధపడిందనే అక్కసుతో శ్రీనివాస్‌ మంగళవారం రాత్రి సత్యవతి ఇంట్లో పెట్రోల్‌ చల్లి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు విజృంభించడంతో నిద్రలో ఉన్న వారికి మెలకువ వచ్చేసరికే ఆలస్యమయింది. ఇద్దరు చిన్నారులు సజీవ దహనం కాగా, మిగిలిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించగా వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos