సజ్జనార్‌-ఓవైసీ ట్విట్టర్‌ వార్‌..

సజ్జనార్‌-ఓవైసీ ట్విట్టర్‌ వార్‌..

ఇరాన్‌-అమెరికా మధ్య తలెత్తిన ఘర్షణ,దాడి ఘటనలు భారత్‌లో కూడా కొన్ని రంగాలపై ప్రత్యక్షంగా,పరోక్షంగా ప్రభావం చూపుతున్నాయి.ఇరాన్‌-అమెరికా మధ్య దాడిప్రతిదాడుల నేపథ్యంలో సురేశ్‌ అనే నెటిజన్‌ అడిగిన ప్రశ్న సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ మజ్లిస్‌ ఎంపీ ఓవైసీ మధ్య ట్విట్టర్‌ వార్‌కు దారి తీసింది.అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్లోని అమెరికా సాఫ్ట్వేర్ సంస్థల్లో జిహాదీలు పనిచేస్తున్నారా? అంటూ సురేశ్‌ ప్రశ్నించాడు.అందుకు కమిషనర్‌ సజ్జనార్‌ స్పందిస్తూ..అవును సర్ఇటువంటి వాటిపై నిఘా వర్గాల నుంచి సమాచారం సేకరించి, జాగ్రత్తలు తీసుకోవడానికి మాకు ప్రత్యేక శాఖలు ఉన్నాయి. మా బృందాలు 24X7 గంటలు పనిచేస్తాయి. మమ్మల్ని అప్రమత్తం చేస్తున్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు. ఏదైనా అనుమానాస్పంగా అనిపిస్తే మాకు సమాచారం అందిస్తూనే ఉండండిఅని బదులిచ్చారు. సదరు నెటిజెన్ ప్రశ్నకు సీపీ అవును అంటూ సమాధానం ఇవ్వడాన్ని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. ‘సార్ మీరు అవును అని సమాధానం చెప్పారు కదా. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఎంతమంది జిహాదీలు పనిచేస్తున్నారో చెప్పగలరా?, లేదంటే మీ ఉద్దేశమేంటో చెప్పండి’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, మీరు కేవలం భక్తులకు మాత్రమే సమాధానాలు చెబుతారా? ఎంపీలకు కూడా సమాధానం చెబుతారా? అని నిలదీశారు.తన ప్రశ్నలకు సీపీ సజ్జనార్ స్పందించకపోవడంతో ఓవైసీ మరో ట్వీట్ చేశారు. ఇటీవలి దిశా ఎన్‌కౌంటర్ గురించి అందులో ప్రస్తావించారు. ‘సార్ మీరేమైనా చేయండి, కానీ తెల్లవారుజామున 5గంటలకు ఎన్‌కౌంటర్ పేరుతో నిందితులను చెప్పడం సరికాదు. అవసరమైతే వాళ్లను పట్టుకుని థర్డ్ ప్రయోగించిన సమ్మతమే,అంతే కానీ వాళ్ల కడుపులో బుల్లెట్లు దింపకండి’ అని మరో ట్వీట్ చేశారు. సీపీ,ఎంపీల మధ్య చోటు చేసుకున్న ఈ ట్విట్టర్ వార్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos