సంబిత్​ పాత్రా చేసిన ట్వీట్లు అవాస్తం

సంబిత్​ పాత్రా చేసిన ట్వీట్లు అవాస్తం

న్యూఢిల్లీ: ఇటీవల కాంగ్రెస్ టూల్కిట్ పేరుతో భాజపా నేత సంబిత్ పాత్రా ట్విట్టర్లో చేసిన వివాదాస్పద ట్వీట్లు అవాస్తవమైనవని ట్విట్టర్ తెలిపింది. సంబంధిత ట్వీట్లను మేనిప్యులేటెడ్ మీడియాగా పేర్కొంది. భాజపా నేతల ట్విట్టర్ ఖాతాలు శాశ్వతంగా తొలగించాలంటూ కాంగ్రెస్ గురువారం ట్విట్టర్కు రాసిన లేఖకు ఆ సంస్థ ఈ మేరకు స్పందించింది. అవాస్తవమైన వీడియోలు, ఆడియోలు, ఫొటోలు ట్విట్ చేస్తే ఈ తరహా చర్యలు చేపడతామని ట్విట్టర్ స్పష్టం చేసింది.భాజపా నేతలు చేసిన ట్వీట్లను తప్పుపడుతూ కాంగ్రెస్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఛత్తీస్ గఢ్ పోలీసులు ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేపడుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos