అచ్చే దిన్ అంటూ.. చచ్చే ది చూపిస్తున్నారు

అచ్చే దిన్ అంటూ.. చచ్చే ది చూపిస్తున్నారు

అమరావతి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదే పదే వంట గ్యాస్ ధర పెంచటాన్ని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ వంట గ్యాస్ ధరల్ని గడిచిన మూడు నెలల్లో నాలుగు సార్లు పెంచింది. కాంగ్రెస్ పాలనలో సిలిండర్ ధర రూ.410. నేడు రూ.1100లు దాటింది. గృహిణులు వంట గదిలోకి వెళ్ళాలంటే భయపడిపోతున్నారు. ఒక వైపు అచ్చే దిన్ అంటూ, మరోకవైపు చచ్చే ది చూపిస్తున్నారు ప్రధాని. పెంచిన వంట గ్యాస్ ధర వెంటనే తగ్గించాలి. వంట గ్యాస్ ధర తగ్గిస్తేనే రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇస్తామని లేకుంటే వ్యతిరేకంగా ఓటు వేస్తామని వైసీపీ, టీడీపీ పార్టీలు ప్రకటించాలి. వంట గ్యాస్ ధర పెంపుపై జనసేన తన వైఖరిని స్పష్టం చేయాల’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos