యాత్రికుల రద్దీ తగ్గింది

యాత్రికుల రద్దీ తగ్గింది

తిరుమల: ప్రసిద్ధ పుణ్య క్షేత్రం తిరుమలలో యాత్రికుల రద్దీ గణనీయంగా తగ్గింది. దక్షిణాదిలో వాడ వాడలా వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ప్రారంభం కావడం ఇందుకు కారణమని తితిదే అధికారులు అభిప్రాయ పడ్డారు. మంగళ వారం ఉదయం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కేవలం ఐదు కంపార్టు మెంట్లలోనే భక్తులు వేచి ఉన్నారు. ఎక్కువంటే వారికి నాలుగు గంటల వ్యవధిలోనే దర్శనాన్ని లభిస్తుందని చెప్పారు. సోమ వారం నుంచి రద్దీ తగ్గింది. శ్రీ వారి హుండీ ఆదాయం రూ. 2.22 కోట్లు. ఈ వారాంతం వరకూ రద్దీ దాదాపు ఇలాగే ఉంటుందని అంచనా వేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos