ఆర్థిక సునామీ రానుంది

ఆర్థిక  సునామీ రానుంది

న్యూఢిల్లీ : ‘దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రతర మవుతోందని నేను చేసిన హెచ్చరికలను పాలకులు ఎద్దేవా చేసారు. ఇప్పుడదే జరుగుతోంది కదా’ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ బుధవారం చేసిన ట్వీట్లో వ్యాఖ్యానించారు. ‘ చిన్న మధ్యతరహా సంస్థలు కుప్పకూలుతున్నాయి..భారీ సంస్థలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి..బ్యాంకులూ ఇబ్బందుల్లో కూరుకుపోయి. ఆర్థిక సునామీ రాబోతోందని నెలల కిందటే నేను చేసిన హెచ్చరికను భాజపా పాలకులు తోసి పుచ్చార’ని పేర్కొన్నారు. కార్పొరేట్ రుణాలు రానున్న వచ్చే ఏడాది అదనంగా రూ 1.68 లక్షల కోట్ల మేర పేరుకుపోతాయనే వ్యాసాన్ని కూడా జత పరిచారు. దేశ ఆర్థిక వ్యవస్థ భారీగా పతనమై ద్రవ్య లోటు బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న 3.5 శాతం కంటే పెరుగుతుందనే వార్తలు వెలువడిన దశలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos