ఒక నెల జీతం 7 రూపాయలు ..

ఒక నెల జీతం 7 రూపాయలు ..

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోకులకు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది.చాల రోజులకు పూర్తి వేతనాలు అందుకోనున్నామనే ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది.లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఏవేవో కారణాలు చూపుతూ వేతనాల్లో కోతలు విధిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం ఈ నెల వేతనాల్లో కోతలు మరింత పెంచింది.తెలంగాణ ఆర్టీసీలో మొత్తం 49 వేలమంది పని చేస్తుండగా చాల శాతం మందికి వెయ్యి నుంచి వంద కొంతమందికి పది రూపాయలలోపు సైతం వేతనాలకు వేశారు.సంగారెడ్డి డిపోకు చెందిన ఒక డ్రైవర్ జీతం రూ.20 వేలు కాగా.. జూన్ నెల వేతనం కింద కేవలం 49 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. ఆ డిపోలో 20 మందికి 100 రూపాయల లోపు జీతం పడిందట. 50 మందికి వెయ్యి రూపాయల్లోపు వేశారట.భద్రాచలం డిపోలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తనకు కేవలం రూ. 7 వేతనం మాత్రమే వచ్చిందని పేస్లిప్ చూపించి వాపోయాడు. ఇదే డిపోలో మరో కార్మికుడు రూ. 57 వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మరో వ్యక్తికి 77 రావడం గమనార్హం. భద్రాచలం డిపోలో మొత్తం 483 మంది పని చేస్తుండగా.. 400 మందికి ఇలా తక్కువ మొత్తంలో జీతాలు పడినట్లు వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ ఆర్టీసీలో 49 వేల మంది ఉద్యోగులు పని చేస్తుండగా.. మెజారిటీ ఉద్యోగుల జీతాలకు ఇలాగే దారుణంగా కోతలు పడినట్లు తెలుస్తోంది. ఇలా అన్యాయంగా కోతలు విధించి వంద లోపు వెయ్యి లోపు జీతాలు వేస్తే తామెలా బతకాలని ఆర్టీసీ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos