ఆగని ఆర్టీసీ సమ్మె

ఆగని ఆర్టీసీ సమ్మె

హైదరాబాదు:గురువారం నుంచి ఆర్టీసీ సమ్మె ఉండదని భావించిన ప్రజలకు నిరాశే మిగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కొనసాగు తోంది. బుధవారం సమావేశమైన ఉద్యోగ సంఘాలు, అక్టోబర్ 4కు ముందున్న పరిస్థితిని కల్పిస్తే, విధుల్లోకి వస్తామని, విధుల్లోకి వచ్చే వారికి ఏ విధమైన షరతులు పెట్టరాదని ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా తన పట్టు సడలించలేదు.. ఆర్టీసీ కార్మికుల వ్యాజ్యం విచారణ కార్మిక న్యాయస్థానంలో జరుగుతున్నందున తీర్పు వచ్చేంత వరకూ వేచి చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. షరతులు విధిం రాదన్న కార్మిక సంఘాల డిమాండ్ ను నిరాక రించాలనీ ప్రభుత్వం తీర్మానించినట్లు తెలిసింది. నిర్దిష్ట కాల పరిమితి వరకూ మరోమారు సమ్మెకు దిగకుండా బాండ్ రాసి వ్వాలని, ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను భవిష్యత్తులో ఎన్నడూ ప్రస్తావించరాదని షరతులు విధించ నున్న ట్టు సమాచారం. వీటికి ఉద్యోగులు అంగీకరిస్తే, విధుల్లోకి రావచ్చని ఆర్టీసి అధికార్లు తెలిపారు. సమ్మె చట్ట విరుద్ధమైనది కావ డంతో, భవిష్యత్తులో పునరావృతం కాకుండా, ప్రజలకు మరో సారి రవాణా సమస్య రాకుండా, జాగ్రత్తల్ని తీసుకోవాలని భావిస్తు న్నామని చెప్పారు.

తాజా సమాచారం