సభ్యత, సంస్కారాల్లేని సభాపతి

సభ్యత, సంస్కారాల్లేని సభాపతి

అమరావతి: ‘శాసనసభ సభాపతి స్థానాన్ని గౌరవించని దుస్థితిలో విపక్షం ఉంది. ఆ పార్టీ నేతే నోరు జారితే ఇతర సభ్యులు ఎలా సంయమనంతో ఉంటారని సభాపతి తమ్మినేని సీతారాం బుధవారం దిగువ సభలో తీవ్రంగా ఆగ్రహించారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన గురించి గురువారం సుదీర్ఘంగా చర్చించుకుందామని ముఖ్యమంత్రి జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన సూచించారు. ఈ చర్చలో పాల్గొన్న చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళానికి దారి తీశాయి. తనకూ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కోరినపుడు సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు చాలా ఉన్నందున గురువారం విద్యా బోధన మాధ్యమం గురించి గురువారం చర్చిస్తామని సీతారాం అన్నారు.దీంతో అసంతృప్తికి గురయిన చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. సభాపతికి సభ్యత, సంస్కారాల్లేవని వ్యాఖ్యానించటంతో సభలో గందరగోళం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు తక్షణం తన వ్యాఖ్యలను ఉపసంహరించు కోని పక్షంలో వాటిని దాఖలాల నుంచి తొలగిస్తామని తమ్మినేని హెచ్చరించారు. ‘చంద్రబాబుపై నాకు గౌరవం ఉంది. అంతమాత్రాన సభాపతి పీఠాన్నిఅవమానిస్తే ఊరుకునేది లేదు. ఒక విపక్ష నేతగా గౌరవంతో మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్పీకర్ స్థానానికి గౌరవ, మర్యాదలు ఇవ్వకుంటే ఎలాగ? మీకున్న 40 ఏళ్ల అనుభవం ఎందుకు ఉపయోగపడింద’ని మండిపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos