ఫైజర్ టీ కాను ఎందుకు దాచి పెట్టారు

ఫైజర్ టీ కాను ఎందుకు దాచి పెట్టారు

వాషింగ్టన్ : అధ్యక్ష ఎన్నికల ఓటమిని అంగీకరించని ట్రంప్ విమర్శలకు పదునుపెట్టారు. కరోనా వైరస్ నివారణకు ఫైజర్ టీకా సమర్థంగా పని చేస్తున్న విషయాన్ని వెల్లడించకుండా కావాలనే ఆ విషయాన్ని ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డిఎ), ఫైజర్, బయో ఎన్టెక్ సంస్థలు దాచి పెట్టా యని ఆరోపించారు. టీకా అభివృద్ధికి తాను చేసిన కృషి ఎన్నికల్లో ఉపయోగపడకుండా ఉండేందుకే ఇలా చేశాయని వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం కాకుండా ప్రజల ప్రాణాలు రక్షించడానికైనా ముందే ప్రకటించి ఉండాల్సిందన్నారు. ఒకవేళ బైడెనే అధ్యక్షుడై ఉంటే టీకా ఎప్పటికి వచ్చి ఉండేది కాదన్నారు. బయో ఎన్టెక్తో కలిసి తాము రూపొందిస్తున్న కరోనా టీకా 90 శాతం మేర సమర్థంగా పనిచేస్తోందని ఫైజర్ సంస్థ సోమ వారం ప్రకటిం చిం ది. అత్యవసర వినియోగానికి ఈ టీకా వినియోగానికి అనుమతించాలని ఎఫ్డిఎకు దరఖాస్తు చేయ నున్నట్లు తెలిపాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos