రెండు స్థానాల్లో టీఆర్ఎస్ బోణీ

రెండు స్థానాల్లో టీఆర్ఎస్ బోణీ

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బోణీ కొట్టింది. రెండు స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. మెట్టగూడలో టీఆర్ఎస్ అభ్యర్థి రాసురి సునిత గెలుపొందారు. యూసుఫ్‌గూడలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్ కుమార్ పటేల్ ఘన విజయం సాధించారు. మెజార్టీ పై అధికారిక ప్రకటన వెలు వడాల్సి ఉంది. ప్రస్తుతం 21 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ-15 స్థానాల్లో, కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానంలో మాత్రం ఆధిక్యంలో ఉంది. ఖైరతాబాద్, అమీర్‌పేట్, సనత్‌నగర్‌తో పాటు పలు డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపుకు దగ్గరలో ఉన్నారు. మరికొన్ని స్థానాల్లో బీజేపీ-టీఆర్ఎస్ పోటాపోటీగా ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos