కమలం వైపు తెరాస నేత అడుగులు!

కమలం వైపు తెరాస నేత అడుగులు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెదేపా అధికారంలో ఉన్న సమయంలో పార్టీలో నంబర్‌ టూ స్థానంలో వెలుగు వెలిగిన దేవేందర్‌గౌడ్‌ బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.2008లో తెదేపాను వీడి సొంతగా పార్టీ స్థాపించి దాన్ని నడపలేక ప్రజారాజ్యంలో విలీనం చేసి అక్కడ కూడా చుక్కెదురు కావడంతో తిరిగి తెదేపాలో చేరిన దేవేందర్‌ అనంతరం తెరాసలో చేరారు.తెరాసలో చేరినా అంతగా గుర్తింపు దక్కకపోవడంతో తాజాగా బీజేపీలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం.అందులో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల రహస్యంగా కలిసినట్లు తెలుస్తోంది. తనకు మద్దతుగా ఉన్న పది మంది కార్యకర్తలను తీసుకొని కిషన్ రెడ్డి ఇంటికి వెళ్లికలిసినట్లు సమాచారం.2014లో కార్పొరేటర్ సీటు కావాలని అప్పటి డిప్యుటీ స్పీకర్ పద్మారావును కోరగా కుదర్లేదు. సారి మళ్లీ అడ్డగుట్ట కార్పొరేటర్ గా ఉన్న విజయ కుమారికి రెండో సారి కూడా అవకాశం ఇస్తున్నట్లు డివిజన్ లో ప్రచారం జరుగుతోంది. దీంతో.. ఇక లాభం లేదని భావించిన నేతటీఆర్ఎస్ నేత పద్మారావు కార్యక్రమాలకు హాజరౌతూనే బీజేపీలో కి వెళ్లేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.తన భార్యకు కార్పొరేటర్ సీటు వస్తుందని ఆయన ఆశించారు. రెండు సార్లు భంగపాటు ఎదురవ్వడంతో ఇంక పార్టీలో కొనసాగడం వ్యర్థమని భావించి బీజేపీలో చేరడానికి నిర్ణయించుకొని ఇదే విషయాన్ని కిషన్ రెడ్డి ముందు ఉంచినట్లు తెలుస్తోంది.అయితే అడ్డగుట్ట డివిజన్కార్పొరేటర్సీటు కోసం పార్టీలు మారతున్న దేవేందర్‌గౌడ్‌ చేరికను అడ్డగుట్ట డివిజన్బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos