అత్యాచారానికి కొత్త నిర్వచనం

అత్యాచారానికి కొత్త నిర్వచనం

లక్నో: మైనర్ బాలికలపై జరిగిన అత్యాచారాలు మాత్రమే నిజమైనవిగా పరిగణించాలని ఉత్తరప్రదేశ్ నీటి సరఫరా, భూ అభివృద్ధి, నీటి వనరుల శాఖ మంత్రి ఉపేంద్ర తివారీ చేసిన వ్యాఖ్య లు సామాజిక మాధ్యమాల్లో సంచలనమయ్యాయి.దేశ వ్యాప్తంగా మైనర్ బాలికలు, మహిళలపై పాశవిక అత్యాచారాలు, హత్యలు తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. బాద్యతా యుతమైన మంత్రి స్థానంలో ఉన్న తివారి వ్యాఖ్యలు మరింత ఆగ్రహాన్ని కల్గిం చాయి. ‘మైనర్ బాలికలపై జరిగిన అత్యాచారాల్ని మాత్రమే నిజమైన రేప్లుగా పరిగణించాలి. కొన్నిసార్లు 30-35 ఏళ్ల వివాహితలూ రేప్ ఆరో పణల ఫిర్యాదుల్ని చేస్తున్నారు. ఈ ఘటనల స్వభావం వేరుగా ఉంటుంది. వాటిని భిన్నంగా చూడాలి. మహిళలు చేసిన అత్యాచార ఆరోప ణలను పరిగ ణించాల్సిన అవసరం లేదు. ఆ మహిళలు 7-8 సంవత్సరాలుగా నిందితుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వుండి వుంటార’ని పేర్కొ న్నారు. తివారీ వ్యాఖ్యలపై నెటి జన్లు మండి పడు తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos