| హైదరాబాద్ పోలింగ్ ముగిసిందో లేదో అప్పుడే కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. అభ్యర్థులను కర్ణాటకకు తరలించాలని నిర్ణయించినట్టు తెలిసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఉన్న అభద్రతను మరో సారి చాటుకొన్నది. గెలిచే కొద్ది మంది ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీలో ఉంటారో? లేదో? అనే అనుమానంతో క్యాంపు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా సమాచారం. గురువారం రాత్రి ఎమ్మె ల్యే అభ్యర్థులకు ఫోన్ చేసి వెంటనే హైదరాబాద్ రావాలని సమాచారం అందించినట్టు తెలిసింది. వీరందరు తాజ్కృష్ణా నుంచి బెంగళూరుకు తరలనున్నట్టు సమాచారం. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వీరికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. అభ్యర్థుల కోసం గురువారం రాత్రి నుంచే వోల్వో బస్సులను సిద్ధం చేసినట్టు సమాచా రం. గురువారం రాత్రి, శుక్రవారం మరికొందరిని కర్ణాటకకు తరలించనున్నారని తెలిసిం ది. అభ్యర్థులు మాత్రం ఇంకా పోలింగ్ ముగియలేదని, పోలింగ్ కొనసాగుతుండగానే హైదరాబాద్కు రావాలని అడగడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.