భారతీయ సంస్కృతి,మేథస్సును చాటిచెప్పే కట్టడాలు..

  • In Tourism
  • November 25, 2019
  • 440 Views
భారతీయ సంస్కృతి,మేథస్సును చాటిచెప్పే కట్టడాలు..

వేల సంవత్సరాల భారతీయ చరిత్ర,సంస్కృతి,మేథస్సును ప్రపంచానికి తెలియజేయడంలో దేశంలోని పలు పురాతన దేవాలయాలు,వాటిపై శిల్పకళ కీలకభూమిక పోషిస్తోంది.కేవలం దేవాలయాలు మాత్రమే కాదు మరెన్నో చారిత్రాత్మక కట్టడాలు,ప్యాలెస్‌లు సైతం భారతీయ పురాతన సంస్కృతిని నేటికీ సజీవంగా నిలుపడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.మరి అటువంటి దేవాలయాలు,కట్టడాల్లో కొన్నింటి గురించి తెలుసుకుందామా!!

రంగనాథస్వామి ఆలయం :
తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి జిల్లాలో ఉన్న రంగనాథస్వామి దేవాలయం పురాతన చరిత్రతో పాటు అప్పటి రాజుల కళాపోషణ,శిల్పులు అద్భుత ప్రతిభ,నైపుణ్యాన్ని చాటి చెబుతోంది.రంగనాథస్వామి ఆలయం కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా పర్యాటకంగా కూడా కేంద్రంగా విరాజిల్లుతోంది.155 ఎకరాల్లో 21 గోపురాలు,39 ద్వారాలతో కావేరి,కొలిదామ్‌ నదుల మధ్య శ్రీరంగం అనే ద్వీపంలో పాండ్య రాజులు నిర్మించిన ఈ దేవాలయం ఎప్పటికీ ఓ అద్భుతమే..

రంగనాథ ఆలయం..

కోపేశ్వర్‌ దేవాలయం. :
కోపేశ్వర్‌ దేవాలయానికి ఆధ్యాత్మిక చరిత్ర ఉన్నట్లు స్థానికుల నమ్మకం.సతి అగ్నిప్రవేశం నేపథ్యంలో ఆగ్రహంతో శివుడు సృష్టించిన వీరభద్రుడు ప్రజాపతిని రాజ్యాన్ని సర్వనాశనం చేసింది ఇక్కడేనని స్థానిక చరిత్ర.శివుడి కోపానికి బలైన కారణంగా ఈ ప్రాంతానికి కోపేశ్వర్‌ అనే పేరు వచ్చినట్లు స్థానికుల నమ్మకం.ఇది పక్కనపెడితే కొప్పం అనే చిన్నపట్టణం పేరుతో ఈ ఆలయానికి కోపేశ్వర్‌ ఆలయంగా పేరు వచ్చిందని ఈ ప్రాంతంలో అనేక యుద్ధాలు జరిగాయని మరికొంతమంది చెబుతుంటారు.ఈ ఆలయంలోని స్వర్గ్‌మండపం అన్నిటికంటే ప్రధాన ఆకర్షణ.ఇది స్వర్గానికి మార్గంగా పూర్వీకులు భావించేవారని ప్రతీతి.మండపంలో గోడలపై చెక్కిన శిల్పాలు చూపుతిప్పుకోలేని అందంగా చెక్కారు.

కోపేశ్వర్‌ దేవాలయం

కోపేశ్వర్‌ దేవాలయం

కోణార్క్‌ సూర్యదేవాలయం :
ఒడిశాలోని పూరి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోణార్క్‌ సూర్యదేవాలయం దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటి.61 మీటర్ల ఎత్తుండే ఆలయ గోపురం,30 మీటర్ల ఎత్తుతో నిర్మించిన గుర్రాలు,చక్రాలతో కూడిన రథం నిజంగా ఓ అద్భుతం.13వ శతాబ్దంలో నిర్మించిన కోణార్క్‌ సూర్యదేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది.సూర్యోదయ,సూర్యాస్తమయ సమయంలో లోతట్టు నుండి చూసినప్పుడు, రథం ఆకారంలో ఉన్న ఆలయం సూర్యుడిని మోస్తున్న నీలి సముద్రపు లోతుల నుండి ఉద్భవించినట్లు కనిపిస్తుంది.

కోణార్క్‌ సూర్యదేవాలయం

చాంద్‌బౌరి :
సుమారు వెయ్యేళ్ల క్రితం రాజస్థాన్‌లోని అనభేరి గ్రామంలో నిర్మించిన చాంద్‌బౌరి బావి ప్రపంచంలోనే అతిపెద్ద బావుల్లో అగ్రస్థానంలో నిల్చుంది.తొమ్మిదో శతాబ్దంలో చందా రాజు నిర్మించిన ఈ బావి నిర్మాణం ఇప్పటికీ రహస్యంగా,అద్భుత కట్టడంగా విరాజిల్లుతోంది.3,500 ఇరుకైన దశలను ఖచ్చితమైన సమరూపతతో అమర్చారు.సుమారు 64 అడుగుల లోతులో, ఇది 13 అంతస్తులతో భారతదేశపు అతిపెద్ద,లోతైన ఈ బావిని కేవలం నీటి సేకరణ కోసం నిర్మించినట్లు తెలుస్తోంది..

చాంద్‌బౌరి

చాంద్‌బౌరి

జంబుకేశ్వర్‌ ఆలయం :
జంబుకేశ్వర్‌ ఆలయం గురించి రెండు రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి.ఒకటి ఆధ్యాత్మిక కథ కాగా మరొకటి చోళరాజుల కథ.అయితే రెండింటికి సరైన ఆధారాలు లేకపోవడంతో జంబుకేశ్వర్‌ చరిత్ర గురించి స్పష్టత లేదు.అయితే జంబుకేశ్వర్‌ ఆలయ నిర్మాణం,శైలి చూస్తే చోళరాజుల హయాంలో నిర్మించినట్లు స్పష్టమవుతోంది. ఆలయం లోపల ఐదు ఆవరణలు ఉన్నాయి. విబుడి ప్రకర అని పిలువబడే ఐదవ ఆవరణను కప్పి ఉంచే భారీ బాహ్య గోడ ఒక మైలు వరకు విస్తరించి రెండు అడుగుల మందం మరియు 25 అడుగుల ఎత్తులో ఉంటుంది. శివుడు కార్మికులతో కలిసి పనిచేసినట్లు గోడ నిర్మించబడిందని పురాణ కథనం. ] నాల్గవ ఆవరణలో 796 స్తంభాలు కలిగిన అతిపెద్ద గది ఉంది.మూడవ ఆవరణ 745 అడుగులు పొడవు 30 అడుగుల ఎత్తు గోడ చుట్టూ ఉంది. ఈ ప్రాంతంలో రెండు గోపురాలు (గేట్‌వే టవర్లు) 73 వెడల్పు,100 అడుగుల పొడవుతో నిర్మించబడ్డాయి. రెండవ ఆవరణ 306 అడుగులు పొడవు 197 అడుగల వెడల్పు ఉండగా 65 అడుగుల ఎత్తుతో ఉన్న గోపురం ఉన్నాయి.శ్రీరంగంలోని రంగనాథ ఆలయం ఈ ఆలయం ఒకే సమయంలో నిర్మించినట్లు తెలుస్తోంది..

జంబుకేశ్వర్‌ ఆలయం

గల్టాజీ :
గల్టాజీ భారత రాజస్థాన్ లోని జైపూర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పురాతన హిందూ తీర్థయాత్ర. జైపూర్ చుట్టుపక్కల ఉన్న కొండల వలయంలో నిర్మించిన దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయం సహజమైన బుగ్గలకు ప్రసిద్ది చెందింది, దీని నుండి నీరు ట్యాంకులలో (కుండ్స్) పేరుకుపోతుంది. ఏడు ట్యాంకులు ఉన్నాయి.అందులో గాల్టా కుండ్ పరవ పవిత్రమైనదిగా భావిస్తుంటారు.గల్తాజీ నీటిలో, ముఖ్యంగా మకర సంక్రాంతిపై స్నానం చేయడం శుభంగా భావిస్తారు మరియు ప్రతి సంవత్సరం వేలాది మంది స్నానం చేయడానికి వస్తారు.

గల్టాజీ

జవగళ్‌ లక్ష్మీనరసింహస్వామి ఆలయం :
కర్ణాటక రాష్ట్రం హాసన్‌ జిల్లాలో 13వ శతాబ్దంలో హొయ్సళ రాజులు నిర్మించిన లక్ష్మీనరసింహా స్వామి ఆలయం ఎన్నో ప్రత్యేకతలతో విరాజిల్లుతోంది.ఆలయం మూడు నిర్మాణాలు వాటిపై చెక్కిన శిల్పాలు నేటికీ చెక్కచెదరకుండా అలనాటి హొయ్సళ రాజుళ కళాత్మకతను,శిల్పుల పనితనాన్ని చాటిచెబుతున్నాయి.ఆధ్యాత్మికంతో పాటు పర్యాటకంగా కూడా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందడంతో ప్రతిరోజూ వేలాది మంది వస్తుంటారు..

జవగళ్‌ లక్ష్మీనరసింహస్వామి ఆలయం

గ్వాలియర్‌ కోట :
15వ శతాబ్దంలో మాన్‌ సింగ్‌ అనే రాజు నిర్మించిన ఈ గ్వాలియర్‌ కోట మధ్యప్రదేశ్‌ రాష్ట్రం పర్యాటకానికే మకుటంగా నిలుస్తోంది.ఆరో శతాబ్దంలో మొదలైన కోట కట్టడం అనేక అవాంతరాలు ఎదుర్కొని 15వ శతాబ్దంలో నిర్మాణం పూర్తి చేసుకుంది.కొండ అంచుచుట్టూ ఆరు టవర్లకు అనుసంధానిస్తూ నిర్మించిన గ్వాలియర్‌ కోట నేటికీ రాజసాన్ని ఒలకబోస్తూ దేశవిదేశాల పర్యాటకులను ఆకర్షిస్తోంది.గ్వాలియర్‌ కోట గోడలపై,లోపలిభాగంలో శిల్పసంపద,గదులు చూస్తే మతిపోవాల్సిందే..

గ్వాలియర్‌ కోట

ఇవి మాత్రమే కాదు ఖజురహోలోని లక్ష్మణ ఆలయం,మహారాష్ట్రలోని యెల్లోరా,యుకటాన్‌ హాల్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ తదితర కట్టడాలు సైతం భారతీయ పురాతన శిల్పకళను,సంస్కృతి,చరిత్రను ఎలుగెత్తి చాటుతున్నాయి..   

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos