ఎగబాకిన టమోటా ధరలు

ఎగబాకిన టమోటా ధరలు

హోసూరు : టమోటా ధరలు గత వారం రోజులుగా ఎక్కువ కావడంతో రైతులకు కాస్త ఊరట లభించింది. గత మూడు నెలలుగా లాక్‌డౌన్ కారణంగా టమోటా ధరలు కుప్పకూలాయి. దీంతో టమోటాలను రైతులు రోడ్డు మీద పారబోశారు. టమోటా ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో హోసూరు ప్రాంత  రైతులు  తీవ్రంగా నష్టపోయారు. లాక్‌డౌన్‌ కారణంగా తగ్గిన టమోటా ధరలు గత వారం రోజులుగా పుంజుకోవడంతో రైతులకు కాస్త ఊరటనిచ్చింది. గతంలో కిలో టమోటాలు రూ.5కు కూడా కొనేవారు కరువయ్యారు. ప్రస్తుతం 22 కిలోల ధర రూ.750 వరకు ఎగబాకింది. టమోటా ధర పెరుగుతుండడంతో హోసూరు ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తాజా సమాచారం