హొసూరులో పెరిగిన టమోటా ధరలు

హొసూరులో పెరిగిన టమోటా ధరలు

హొసూరు : టమోటా ధరలు పెరగడంతో హొసూరు ప్రాంత రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. హొసూరు, పరిసర ప్రాంతాలలో టమోటా, బీన్స్, బంగాళాదుంపలు, క్యారెట్, బీట్రూట్ తదితర పంటలను ఎక్కువగా పండిస్తూ ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా హొసూరు ప్రాంతంతో పాటు కర్ణాటక, ఆంధ్రా తదితర రాష్ట్రాలలో టమోటా పంటను ఎక్కువగా సాగు చేయడం వల్ల ధరలు పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నెలరోజుల కిందట హొసూరు మార్కెట్‌లో 22 కిలోల టమోటా రూ.150 చొప్పున విక్రయించగా, కూలీల ఖర్చులు కూడా రావని రైతులు పంటను తోటల్లోనే వదిలి వేశారు. ప్రస్తుతం కర్ణాటక, ఆంధ్రా, కేరళ రాష్ట్రాలలో వర్షాల కారణంగా టమోటా పంట దెబ్బతింది. దీంతో హొసూరు నుంచి ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఎక్కువగా కొనుగోలు చేయడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి.ప్రస్తుతం 22 కిలోల టమోటాలు రూ.600కు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక, ఆంధ్రా, కేరళ వ్యాపారులు ఎక్కువగా టమోటాలు కొనుగోలు చేస్తున్నారని రైతులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos