మధ్యప్రదేశ్ గద్దెపై నరేంద్ర తోమర్

మధ్యప్రదేశ్  గద్దెపై నరేంద్ర తోమర్

భోపాల్ : మధ్య ప్రదేశ్ రాజకీయాలు ఒక్క సారిగా మారి పోయాయి. ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ను కాదని కేంద్ర వ్యవసాయ మంత్రి, ప్రధాని మోదీకి అత్యంత ఆప్తుడైన నరేంద్ర సింగ్ తోమర్‌ను నాయకత్వం తెర పైకి తెచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో నరేంద్ర తోమర్ పదవికి సరి తూగుతారని భాజపా అధిష్ఠానం భావిస్తోంది. అధికారి కంగా ప్రకటించాల్సి ఉంది. భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కూడా ఆయన పని చేసారు. మోదీకి ఆప్తుడు కావడం కలిసొచ్చే అంశం. తోమర్ క్షత్రియ కులానికి చెందిన నేత. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి బాధ్యతల్ని చేపట్టిన ఉమా భారతి, బాబూలాల్ గౌర్, శివరాజ్ సింగ్ వెనుకబడిన కులాలకు చెందిన వారు. రాష్ట్రంలో ఈ వర్గం ఓటర్లే ప్రభుత్వ స్థాపనలో కీలకంగా వ్యవహరిస్తారు. కానీ భాజపా అధిష్ఠానం సాహసం చేసి క్షత్రియ కులానికి చెందిన తోమర్కు పట్టం కట్టదలచింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు శర్మ, తోమర్ ఇద్దరూ అగ్ర కులాలకు చెందినే నేతలే కావడంతో ఇతర వర్గీయుల నుంచి ఇబ్బంది ఏర్పడుతుందేమోనన్న భయం ఒక వర్గం ఉంది. ప్రస్తుత అవసరాల దృష్ట్యా తోమర్‌ వైపే అధిష్ఠానం మొగ్గు చూపుతోంది. త్వరలో చంబల్, గ్వాలియర్ లోక్సభ నియోజకవర్గాల్లోని 25 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరుగనున్నాయి. శాసన సభ ఎన్నికల్లో భాజపా ఓడిపోయింది. ఇది శివరాజ్ సింగ్ చౌహాన్‌ మీద వ్యతిరేకత ఎంత మాత్రం కాదు. అంతటి ఉద్ధండుడ్ని కాదని తోమర్‌ను తెరపైకి తేవడం ఏమాత్రం కలిసొస్తుందన్నది చూడాల్సిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos