20 నుంచి టోల్ వసూలు

20 నుంచి టోల్ వసూలు

న్యూ ఢిల్లీ : టోల్ వసూళ్లను ఈ నెల 20 నుంచి ఆరంభించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) రంగాన్ని సిద్ధం చేస్తోంది. కరోనా వ్యాప్తి నివారణకు గత నెల 24న కేంద్రం లాక్డౌన్ ప్రకటించింది. అంతర్ రాష్ట్రాల మధ్య నిత్యావసర సరుకులు రవాణా చేసే వాహనాలపై కేంద్రం టోలు రుసుమును నిలిపివేసింది. వచ్చే సోమ వారం నుంచి సుంకాల్ని వసూలు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఎన్హెచ్ఏఐకి లేఖ రాసింది. ఇందుకు రవాణా సంఘాలు ఆగ్రహించాయి. లాక్డౌన్ కారణంగా రవాణా రంగం పూర్తిగా కుదేలైంది. ఎన్నో ఇబ్బందులు తట్టుకుని నిత్యావసర సరుకుల రవాణా కొనసాగిస్తున్న ప్రస్తుత తరుణంలో సుంకాల వసూలు సరికాదని అఖిల భారత మోటారు ట్రాన్స్పోర్టు కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) ఆవేదన వ్యక్తం చేసింది. రవాణా రంగాన్ని ఆదుకోవటానికి బదులుగా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం సరి కాదని పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos