వాణిజ్యం, రక్షణ రంగాలపై మోదీ, ట్రంప్ చర్చలు

వాణిజ్యం, రక్షణ రంగాలపై మోదీ, ట్రంప్ చర్చలు

టోక్యో :ఇక్కడ జరుగుతున్న జీ 20 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సమావేశమై ఇరాన్ వ్యవహారాలు, 5జీ నెట్వర్క్, వాణిజ్య, రక్షణ రంగాలకు సంబంధించి పలు అంశాల గురించి నేతలు చర్చించారని శ్వేత భవనం ట్వీట్ చేసింది. రక్షణ సహకారం పెంపు, శాంతి సుస్ధిరతల పరిరక్షణ, వర్తక లోటును అధిగమించడంతో సహా అనేక అంశాలు చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. భారత్ వాణిజ్య వ్యవహారాల్లో తీసుకుంటున్న చర్యలను ట్రంప్ స్వాగతించారని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు. ట్రంప్, మోదీల భేటీ ఫలప్రదమైందన్నారు. 5జీ సాంకేతికతను సమర్థ వినియోగానికి చేపట్టిన చర్యల పట్ల ట్రంప్ సంతృప్తి వ్యక్తీకరించారని చెప్పారు. ఈ రంగంలో భారత్తో కలిసి పని చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos