పార్లమెంట్ ను ముట్టడిస్తాం

పార్లమెంట్ ను ముట్టడిస్తాం

శిఖర్ : కొత్త సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయకపోతే పార్లమెంట్ ను ముట్టడిస్తామని రైతు సంఘాల నేత రాకేశ్ తికాయత్ హెచ్చరించారు. రాజస్థాన్లోని శిఖర్ లో బుధవారం యునైటెడ్ కిసాన్ మోర్చా నిర్వహించిన కిసాన్ మహాపంచాయితీలో మాట్లాడారు. ‘ఢిల్లీ వైపు సాగేందుకు రైతులంతా సిద్ధంగా ఉండాలి. ఏ క్షణమైనా ఢిల్లీ ముట్ట డి పిలుపు వచ్చే అవకాశం ఉంది. ఈసారి 4 లక్షల ట్రాక్టర్లు కాదు.. 40 లక్షల ట్రాక్టర్లతో పార్లమెంట్ ను ముట్టడిస్తాం. ఆందోళన చేస్తున్న రైతులు ఇండియా గేట్ వద్ద పార్కు లను దున్ని పంటలు పండిస్తారు. పార్లమెంట్ ముట్టడి తేదీని యునైటెడ్ ఫ్రంట్ నిర్ణయిస్తుంది. జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసను అడ్డు పెట్టు కుని రైతులకు మకిలి అంటించే ప్రయత్నం చేస్తున్నారు. దేశ రైతులు త్రివర్ణ పతాకాన్ని ప్రేమిస్తారు కానీ.. దేశ నేతలను కాదు. చట్టాలు రద్దు చేయకపోతే పెద్ద పెద్ద కంపెనీల గోదా ములను కూల్చిపారేస్తాం. వాటిని కూల్చేందుకు తేదీలతో సిద్ధమవుతాం. ఆ తేదీలనూ తొందర్లోనే ఖరారు చేస్తామ’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos