11 నుంచి వెంకన్న దర్శనం

11 నుంచి వెంకన్న దర్శనం

తిరుమల : శ్రీవారి దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల ఎనిమిది నుంచి తిరిగి ప్రారంభిస్తోంది. తొలి మూడ్రోజుల పాటు ప్రయోగాత్మకంగా స్థానికులు, సిబ్బందికి మాత్రమే దర్శనాన్ని కల్పిస్తారు. పునః ప్రారంభ ఏర్పాట్లను తితిదే అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం పరిశీలించారు. తర్వాత రిశీలించారు. అనిల్కుమార్ సింఘాల్ విలేఖరులతో మాట్లాడారు. ‘ఈ నెల 8 నుంచి ఆన్లైన్లో శ్రీవారి దర్శనం టికెట్లు రోజుకు మూడు వేలు అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజూ 7 వేల మందికి మాత్రమే దర్శనం. ఆన్లైన్లో దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన వారికి గదులు కేటాయిస్తాం. సరి, బేసి పద్దతిలో గదుల కేటాయింపు ఉంటుంది. ఒక్కో గదిలో ఇద్దరు మాత్రమే ఉండాలి. గ్రామ సచివాలయాల్లో కూడా ఆన్లైన్లో టికెట్లు కొన వచ్చు. వరుస మార్గాల్లో విధులు నిర్వహించే వారికి పీపీఈ కిట్లు ఇస్తాం. బస్సులతో పాటు భక్తుల లగేజీని కూడా పూర్తిగా పరిశుభ్రం చేస్తాం. ప్రతీ రెండు గంటలకు ఒకసారి లడ్డూ కౌంటర్లను మారుస్తామ’ని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos