బెంగాల్‌లో వలసలు

బెంగాల్‌లో వలసలు

ఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి భాజపాలోకి వలసలు ప్రారంభమయ్యాయి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో దీదీని ఖంగు తినిపించిన భాజపా, ఆమెను మరింత ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నంలో పడింది. అందులో భాగంగా ఇద్దరు తృణమూల్‌ ఎమ్మెల్యేలు, ఓ సీపీఎం ఎమ్మెల్యే, అరవై మందికి పైగా మునిసిపల్‌  కౌన్సిలర్లు భాజపా తీర్థం పుచ్చుకున్నారు. భాజపా నాయకుడు ముకుల్‌ రాయ్‌ తనయుడైన తృణమూల్‌ ఎమ్మెల్యే సుబ్రంగ్‌షు రాయ్‌తో పాటు అదే పార్టీకి చెందిన తుషార్‌కాంతి భట్టాచార్య, సీపీఎంకు చెందిన దేవేంద్రనాథ్‌ రాయ్‌లు భాజపాలో చేరారు. 42 లోక్‌సభ స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో భాజపా అనూహ్య రీతిలో 18 స్థానాల్లో గెలుపొంది దీదీకి గట్టి సవాలు విసిరిన సంగతి తెలిసిందే. తృణమూల్‌ 22 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos