ఈటల నిర్ణయంపై కోదండరామ్ అసంతృప్తి

ఈటల నిర్ణయంపై కోదండరామ్ అసంతృప్తి

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిర్ణయంపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ఒక మంచి అవకాశాన్ని ఈటల చేజార్చుకున్నారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడే శక్తిగా మారతారని తెలంగాణ సమాజం ఈటల వైపు చూసింది. ఈటల నిర్ణయంతో పోరాడాలనుకున్న వాళ్ళు చల్లబడిపోయారు. కేసీఆర్ మీద పోరాటం చేస్తే నేను, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కలసివస్తామని ఈటలకు చెప్పాం. బీజేపీలో చేరాలన్న ఈటల నిర్ణయం ఆయన వ్యక్తి గతం. ఈటల చేరిక వలన బీజేపీకే లాభం. ఈటలకొచ్చేదేమీ లేదు. ఆయన తీసుకునే నిర్ణయం అందర్నీ కలుపుకుపోయేలా ఉంటుందని భావించాం. బీజేపీలో చేరవద్దని ఈటలకు ఎప్పుడూ చెప్పలేదు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వంపై పోరాటం చేయటంలో ప్రతిపక్షాలు విఫలమైన మాట వాస్తవమేన’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos