చైనాపై కన్నేస్తే అంతే

చైనాపై కన్నేస్తే అంతే

బీజింగ్: తమ భూ భాగాన్ని వశపర్చుకోదలిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ సోమవారం ఖాట్మండులో హెచ్చరించారు. నిందితులను చైనాకు అప్పగించాలనే ముసాయిదాకు వ్యతిరేకంగా హాంకాంగ్ ప్రజలు పెద్ద ఎత్తున్న నిరసన ప్రదర్శనలు జరుపుతుండటం తెలిసిందే. జిన్ పింగ్ తరఫున చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘మా దేశాన్ని ముక్క చెక్కలు చేసేందుకు బాహ్య శక్తులు సాయం చేస్తే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం. చైనా భూభాగాన్ని వశపరచుకోవాలని చూసే వారి శరీరాలను నుజ్జు నుజ్జు చేస్తామ’ని హెచ్చరించారు. హాంకాంగ్, తైవాన్లు తమ భూ భాగానికి చెందినవేననేది చైనా వాదన. హాంకాంగ్, తైవాన్లో చైనా కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తమ ప్రాంతాన్ని చైనాలో భాగంగా గుర్తించడాన్ని తైవాన్ అధ్యక్షురాలు సై యింగ్ వెన్ తీవ్రంగా వ్యతిరేకించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos