చైనా జోక్యాన్ని ఆక్షేపించరా?

చైనా జోక్యాన్ని ఆక్షేపించరా?

న్యూ ఢిల్లీ : జమ్ము-కశ్మీర్ వ్యవహారాల్లో చైనా జోక్యం చేసుకుంటున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారి ఆక్షేపించారు. కశ్మీర్ పరిణామాలను తాము గమనిస్తున్నామని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరాన్ని తెలిపారు. అంతర్జాతీయ, ప్రాంతీయ పరిణామాలతో సంబంధం లేకుండా చైనా-పాక్ బంధం కొనసాగుతుందని జిన్పింగ్ తనను కలుసుకున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో వ్యాఖ్యానించటం తెలిసిందే. హాంకాంగ్లో ప్రజాస్వామ్య అనుకూల నిరసనలు, జినియాంగ్లో మానవ హక్కుల ఉల్లంఘన, టిబెట్లో అణిచివేత వంటి అంశాలను భారత్ ఎందుకు లేవనెత్తదని ప్రశ్నించారు. భారత అంతర్గత వ్యవహరాల్లో చైనా జోక్యాన్ని కేంద్రం నియంత్రించడంలో విఫలమవుతోందని మండి పడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీతో శుక్రవారం చెన్నైలో చైనా అధ్యక్షుడి భేటీ నేపథ్యంలో జిన్పింగ్ పాక్ అనుకూల వ్యాఖ్యలు చేయడం దుమారాన్ని లేపుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos