గూగుల్‌తో టైటాన్‌ ఢీ

గూగుల్‌తో టైటాన్‌ ఢీ

వాషింగ్టన్: హువావేపై అమెరికా విధించిన నిషేధం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని గూగుల్‌ భావిస్తోందట. దరిమిలా నిషేధం నుంచి తమను మినహాయించాలని ట్రంప్ ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు గల కారణాల్ని కూడా సోదాహరణంగా వివరించింది. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ సహా, ఇతర సేవల కోసం హువావే గూగుల్‌పై ఆధారపడటం అమెరికాకు లాభించే విషయమని విపులీకరించింది. అమెరికా ఆంక్షల్ని అధిగమించేందుకు హువావే ‘టైటాన్‌’ పేరిటి నూతన ఆపరేటింగ్‌ సిస్టమ్ తయారీకి కసరత్తు చేస్తోంది. అత్యాధునిక ఫీచర్లతో ఇది రానుందని నిపుణులు తెలిపారు. దీంతో గూగుల్‌ వెన్నులో ఒక్కసారిగా వణుకు పుట్టింది. ప్రపంచ వ్యాప్తంగా తన ఏకఛత్రాధిపత్యానికి ఎక్కడ గండి పడుతోందనన్న ఆందోళనఆరంభమైంది. చైనా మొబైల్‌ కంపెనీలు అంతర్జాతీయ విపణి కోసం గూగుల్ ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ను వినియోగిస్తున్నాయి. ఇంకా కేవలం చైనా వినియోగదార్లకు పరిమితంగా ప్రత్యేక యాప్స్ తయారు చేశారు. చైనా, అమెరికా సంబంధాలు పూర్తిగా దెబ్బతింటే ఈ ఫోన్లకు సంబంధించిన భద్రత, అప్‌డేట్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని గూగుల్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos