ఆసియా కప్‌లో చోటు దక్కించుకున్న తెలుగు ఆటగాడు

ఆసియా కప్‌లో చోటు దక్కించుకున్న తెలుగు ఆటగాడు

ముంబై: మొన్నటి ఐపీఎల్, ఇటీవలి వెస్టిండీస్ సిరీస్లో అదరగొట్టిన తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు ఆసియా కప్లో చోటు దక్కిన విషయం తెలిసిందే. తొలిసారి ఓ మేజర్ టోర్నీలో తిలక్ భాగం కాబోతున్నాడు. ఈ నేపథ్యంలో అతడి ఎంపికపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్తో సిరీస్లో తిలక్ ఆట ఆకట్టుకుందని అజిత్ చెప్పాడు. అతనికి మరికొన్ని అవకాశాలు ఇవ్వాలనే వన్డేల్లోకి తీసుకున్నామని తెలిపాడు. ఎడం చేతి వాటం కూడా ఉండటం అదనపు అర్హత అని అగార్కర్ వివరించాడు. మరో వైపు ఆసియా కప్నకు ఎంపిక చేసిన వారి నుంచే.. వరల్డ్కప్ టీమ్ను ఎంచుకోవడం ఖాయమని అజిత్ అగార్కర్ వివరించాడు. అన్ని మ్యాచ్లు చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. రెండో స్పిన్నర్ను జట్టులోకి తీసుకునే అవకాశం లేకపోవడంతో చహల్ను పక్కన పెట్టినట్లు వివరించాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos