టిక్‌టాక్‌ తొలగించిందని ట్విట్టర్‌లో పెట్టారు..

టిక్‌టాక్‌ తొలగించిందని ట్విట్టర్‌లో పెట్టారు..

భారత్‌,పాకిస్థాన్ దేశాలకు చెందిన యువతులు అంజలి చక్రా, సుందాస్ మాలిక్‌ చేసిన డ్యాన్స్ వీడియోను టిక్ టాక్ తొలగించింది. వీరిద్దరూ నృత్యం చేస్తూ, నవ్వుతూ, ముద్దులు పెట్టుకుంటూ వేసిన స్టెప్పులు తెగ వైరల్ అయ్యాయి.అయితే టిక్‌టాక్‌ హఠాత్తుగా తమ వీడియోను తొలగించడంతో వీడియో ఎందుకు తొలగించారని అంజలి, సుందాస్ టిక్ టాక్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. తమ వీడియోను తొలగించాల్సినంత తప్పు ఏం చేశామని ప్రశ్నించారు.యువతులు లెస్బియన్లు కావడంతోనే వీడియోను తొలగించారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.కాగా టిక్ టాక్ లో వీడియోను తొలగించిన తరువాత ట్విట్టర్‌లో వీడియోను అంజలి పోస్ట్ చేయగా ట్విట్టర్‌లో ఈ వీడియో వైరల్‌ కావడం గమనార్హ.కొద్ది రోజుల క్రితం ఓ పారదర్శక గొడుగు కింద అంజలి,సుందాస్‌ లిప్‌లాక్‌ పెట్టుకున్న ఫోటోలపై కూడా విమర్శలు వచ్చాయి.అయితే ఈ ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం విశేషం..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos