లాక్‌డౌన్ పెట్టినా ఆందోళన ఆపబోం

లాక్‌డౌన్ పెట్టినా ఆందోళన ఆపబోం

లఖ్నవూ : దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించినప్పటికీ తమ ఆందోళన ఆపబోమని రైతు సంఘాలు తేల్చి చెప్పాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనను లాక్డౌన్ అడ్డుకోజాలదని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ స్పష్టం చేశారు. బుధవారం ఉత్తరప్రదేశ్లోని ఘాజీ పూర్లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ‘‘రైతుల ఆందోళనను మరో షహీన్బాఘ్ కానివ్వం. లాక్డౌన్ విధించినప్పటికీ మా ఆందోళన కొనసాగుతుంది. ప్రభుత్వం సూచించే అన్ని రకాల కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే రైతుల ఆందోళనను కొనసాగిస్తాం’’ అని అన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నాలుగు నెలలుగా ఢిల్లీ సరి హద్దు ల్లో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే కోవిడ్ మళ్లీ విజృంభించడంతో ఆందోళన కొనసాగుతుందా అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos